హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : నిరుడు బీహార్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం మూడు రాష్ర్టాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. బీహార్‌లోని పాట్నా, భాగల్పూర్, భోజ్‌పూర్, మోతిహారితోపాటు జమ్మూ అండ్ కశ్మీర్‌లోని అనంతనాగ్, హైదరాబాద్‌లో నిందితులు, అనుమానితుల ఇండ్లల్లో తనిఖీలు చేసింది. సోదాల్లో రూ.1,49,400 నగదు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డిజిటల్ పరికరాలతోపాటు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.