హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాజీ మావోయిస్టులు, మావోయిస్టు (Maoists) సానుభూతిపరుల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్లో మాజీ మావోయిస్టు రవివర్మ, అనురాధ, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన రవివర్మ ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కళ్యాణ్ రావు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో వారికి గల సంబంధాలపై, ఇటీవల ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై ఆరా తీస్తున్నారు.