హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): నటుడు జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జాతీయ మానవ హకుల కమిషన్ అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశించింది. నిరుడు ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై 8 వారాల్లోగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.