బీబీనగర్/సుబేదారి, ఆగస్టు 20 : టోల్‌ప్లాజా ఆవరణలో హోటల్ నిర్వహణకు లంచం తీసుకుంటూ ఎన్హెచ్ఏఐ వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్.. సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా ఆవరణలో ఓ ప్రైవేటు హోటల్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఐదేండ్లపాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే రూ.లక్ష లంచం కావాలని ఎన్హెచ్ఏఐ వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ దుర్గాప్రసాద్ ప్రైవేట్ వ్యక్తి ద్వారా డిమాండ్ చేశాడు.
దీంతో హోటల్ యజమాని సీబీఐకి ఫిర్యాదు చేశా రు. ఆ తరువాత హోటల్ నిర్వాహకుడు రూ. 60వేలు లంచం ఇచ్చేందుకు సదరు అధికారితో ఒప్పందం చేసుకున్నారు. బుధవారం గూడురు టోల్‌ప్లాజా వద్ద దుర్గాప్రసాద్.. హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సీబీఐ అధికారులు హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలోని ఎన్హెచ్ఏఐ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.