హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బస్‌భవన్ పకన ఖాళీ స్థలంలో ఉన్నవన్నీ స్రాప్ బస్సులేనని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అవి రెగ్యులర్ బస్సులనే విధంగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడతున్నాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. కాలం చెల్లిన బస్సులనే ఖాళీ స్థలంలో పారింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చిలో 262 బస్సులకు సంస్థ వేలం నిర్వహించగా, 180 బస్సులు అమ్ముడుపోయాయని, మిగతా వాటిని అక్కడే నిలిపి ఉంచినట్టు తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం మాడాపూర్, కోమటికుంట స్టేజీల వద్ద ఆర్టీసీ బస్సులను ఆపలేదంటూ ప్రచురించిన కథనంలో కూడా వాస్తవం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొన్నది. పల్లెవెలుగు సర్వీసులకు మాత్రమే ఆయా స్టేజీల్లో స్టాప్ ఉందని, ప్రయాణికులు ఉంటే ఎక్స్‌ప్రెస్ సర్వీసులనూ ఆపాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.