తిరోగమన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తిరోగమన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొంది.
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్- మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలుపడుతాయని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ను జారీ చేసింది.
గడిచిన 24 గంటల్లో..
సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 16.28 సెంమీకు గాను సోమవారం నాటికి 25.96 సెంమీ నమోదైంది. ఇది నిరుటితో పోలిస్తే 95 అధికం. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, జయశంకర్భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.