హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు, అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ల వివరాలను ఈ వెబ్ పోర్టల్‌లో ఉంచుతారు. నిరుద్యోగులతోపాటు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అభ్యర్ధులకు కంపెనీలే నేరుగా మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపడంతోపాటు కాల్చేసి పిలుస్తాయి. ‘డీట్’ అనేది కంపెనీలకు, ఉద్యోగార్థులకు మధ్య వారధి లాంటిదని, ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు సంయుక్త కమిటీ ;తెలంగాణ, ఏపీ సీఎస్ల భేటీలో నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ నియంత్రణకు ఏపీ, తెలంగాణ పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి బృందం సోమవారం ఏపీకి వెళ్లింది. మంగళగిరిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్‌తో సమావేశమయ్యారు. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ, తెలంగాణ మధ్య పంపకానికి ఒప్పుకన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి అధికంగా చెల్లించిన రూ.81 కోట్లను తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు ఏపీ అంగీకరించింది.