Sarpanch | కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామం నుంచి కోతులను తరిమికొట్టాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
లింగాపూర్ గ్రామ ప్రజలు రెండు మూడేండ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో చందాలు వేసుకుని గ్రామంలో అక్కడక్కడ బోనులు ఏర్పాటు చేశారు. ఆ బోనుల్లో ఎక్కడో కొన్ని కోతులు పడ్డాయి. కానీ పూర్తిస్థాయిలో ఈ ఇబ్బందిని రూపుమాపలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమ్మరి రంజిత్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్‌ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.
గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ విన్నూత్న ప్రయత్నం
ఎలుగుబంటి కనిపించడంతో పరారైన కోతులు.. యువ… pic.twitter.com/Pf6yBNUOf1
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025