నీలగిరి, ఆగస్టు 28: రాఖీ పండుగ వేళ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ దవాఖానలో విషాదకర ఘటన చోటుచేసుకున్న ది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు శుక్రవారం దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నల్లగొం డ పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గురువారం చేరింది.
అయితే, శిశువు గుండె స్పందనలు తగ్గిపోయాయని, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. సిజేరియ న్ అనంతరం మగబిడ్డ జన్మించింది. రాత్రి వరకు బాగానే ఉన్న శిశువు అనారోగ్యంతో మృతిచెందినట్టు వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు దవాఖాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.