హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ): సంక్రాంతి తరువాత కొత్త తెల్లరేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను మొదలు పెట్టబోతున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించా రు. సోమవారం ఉదయం రాష్ట్ర శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆచార్య కోదండరాంరెడ్డి, మీర్జా రియాజుల్ హసన్ ఏఫెండిలతో పాటు జీవన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 6,47,479 రేషన్‌కార్డులను గత ప్రభు త్వం జారీ చేసిందని వెల్లడించారు. కొత్త గా పది లక్షల కొత్త రేషన్‌కార్డుల మంజూ రు ఉండవచ్చని సభకు వివరించారు. తద్వారా 31లక్షల మంది కి ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు కులగణన సర్వేను ఆధారం చేసుకుంటామ ని తెలిపారు. కొత్త కార్డుల మంజూరుతో ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భా రం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులు జారీ చె య్యబోతున్నట్టు ఆయన వెల్లడించారు. కొ త్తకార్డుల అర్హతా ప్రమాణాలను నిర్ణయి స్తూ మంత్రివర్గ ఉపసంఘం సిఫారుసుల ను క్యాబినెట్ ముందుంచినట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.