హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనంతోపాటు శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. అది పాలరాతితో చేసిన సింహాసనం అని, దానిపై పాదాలు, వెనక గుండ్రని రాతిపలకపై నాగరిలిపిలో మూడు పంక్తుల శాసనం ఉన్నట్టు వెల్లడించారు.
సింహాసనం ముందు భాగాన అభిషేక జలాలు పోవడానికి సింహ ముఖప్రణాళిఉన్నట్లు చెప్పారు. ఇటువంటి సింహాసనం ఇంతకు ముందు ఎకడా కనిపించలేదన్నారు. ఎల్లమ్మగుడి, హనుమాండ్ల గుడి, బేతాళుని గుడి మూడుచోట్ల జైనబసదుల ఆనవాళ్లు లభించాయని తెలిపారు.