హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా మండల కేంద్రం చారగొండ గ్రామంలోని శివాలయ పరిసరాల్లో మూడు అరుదైన శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్‌గౌడ్ తెలిపారు. వీటిలో రాజపిండితగల్లు, భైరవుడు, సప్తమాతృకలు శిల్పాలు ఉన్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తెలంగాణ చరిత్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో వాటిని కనుగొన్నట్టు వెల్లడించారు.
రాజపిండితగల్లు శిల్పం ఒకటో శతాబ్దం కాలం నాటిదని, అర్ధపద్మాసనంలో కూర్చున్న రాజు, కుడిచేతిలో ఖడ్గం, మొనను ఎడమపాదం మీద విశ్రాంతంగా ఆనించాడని వివరించారు.