హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండానే పలువురు వాహనదారులు అడ్డదారిలో ఏజెంట్ల ద్వారా లైసెన్సులు పొందుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అందు లో భాగంగా తొలి దశలో 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏ ర్పాటుచేయాలని నిర్ణయించింది. వీ టి ఏర్పాటుతో మానవ ప్రమేయం ఉండదు.
పరీక్షకు హాజరైన వ్యక్తికి డ్రైవింగ్ వస్తుందా? రావట్లేదా? లైసె న్సు ఇవ్వాలా? వద్దా? అనేది సంబంధిత సాఫ్ట్ వేరే నిర్ణయిస్తుంది. పరీక్ష కోసం వచ్చే వారి డ్రైవింగ్‌ను పరిశీలించడానికి ట్రాక్‌లలో కెమెరాలు బిగిస్తారు. వీటి ద్వారా నిర్దేశిత సమయంలో పరీక్ష పూర్తయ్యిందా లేదా? రెడ్ సిగ్నల్ దగ్గర ఆగారా లేదా? ఇలా ప్రతి ప్రక్రియను చిత్రీకరిస్తారు. డ్రైవింగ్ టెస్ట్‌కు దరఖాస్తుదారే వచ్చా డా? ఇతరులు వచ్చారా? అనేది కూ డా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వా రా గుర్తిస్తారు. 21 ప్రాంతాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏ ర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే మంత్రి పొన్నం అధికారులతో సమీక్షించారు.