DSC | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్స రం ప్రారంభమైనా టీచర్ల కొరత వేధిస్తున్నది. కొత్తగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. 21,299 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
జూలై 17 నుంచి 31 వరకు 2,79,956 మంది అభ్యర్థులు డీఎస్సీ రాత పరీక్షలు రాయనున్నారు. నియామకాలు కొలి క్కి వచ్చే వరకు సెప్టెంబర్ దాటే అవకాశలున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా, డీఎస్సీని నెల రోజలు వాయిదావేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష కావడంతో టీసీఎస్ నుంచి తేదీలు తీసుకున్నామని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.