హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈనెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్టికెట్లలో కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఈ నెల 1 నుంచే ప్రారంభమైంది. అప్పుడు హాల్‌టికెట్‌పై అభ్యర్థి పాస్‌పోర్టు ఫొటో అతికించాలని చెప్పలేదు. మూడు రోజుల తర్వాత హాల్‌టికెట్‌పై ఫొటో అతికించాలని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ఇలా రోజుకో నిబంధన పెట్టడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేసినప్పటికీ, పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించడంపై మండిపడుతున్నారు.