హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్(ఆర్టీఐ)కు కొత్తగా నియమితులైన నలుగురు కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో నిర్వహించి న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.
చీఫ్ కమిషనర్ జీ చంద్రశేఖర్రెడ్డి నూతన కమిషనర్లుగా నియమితులైన పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో ప్రమాణ స్వీ కారం చేయించారు. ఈ సందర్భంగా సీఎం నూతన కమిషనర్లకు పుష్పగు చ్ఛం అందించి అభినందనలు తెలిపారు. వీరు మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.