హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదిత హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల ప్రాజెక్టు సవరణలకు గురువారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సవరించిన ప్రతిపాదనల ప్రకారం 5,566కి.మీ.లమేర రూ. 10,547 కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. క్యాబినెట్ ఆ మోదం పొందడం తో వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. గతంలో 5190.25 కి.మీ మేర 373 రోడ్లను రూ. 6478.33కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా.. వివిధ వర్గాలనుంచి వచ్చిన వినతులమేరకు తాజాగా రోడ్ల సంఖ్యను, వ్యయాన్ని పెంచారు. ప్రభుత్వం 40% నిధులను భరించనుండగా, మిగిలిన 60% ప్రైవేటు ఏజెన్సీలు వెచ్చిస్తాయి. 15 ఏండ్లపాటు రో డ్లను సంబంధిత ఏజెన్సీ నిర్వహిస్తుంది.