చండూరు: నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడింది. చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ చండూరును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పుడు చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం చండూరు మండలం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చండూరును నూతన రెవెన్యూ డివిజన్‌గా మార్చి.. అందులో నల్లగొండ రెవెన్యూ డివిజన్లోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను, దేవరకొండ రెవెన్యూ డివిజన్లోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలిపింది.