Attendance | లేట్‌గా వస్తే సీఎల్ కట్.. పాఠశాల విద్యాశాఖలో కొత్త నిబంధన.. టీచర్లకూ ఇదే వర్తింపు?
Attendance | ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్‌గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్‌గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఉద్యోగులంతా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
Attendance | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్‌గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్‌గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఉద్యోగులంతా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నెలవారీ హాజరు లెక్కింపు విషయంలోఎఫ్ఆర్ఎస్ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది.
ఉద్యోగులకు ఏడాదిలో 15 సాధారణ సెలవులు (సీఎల్స్), 30 ఆర్జిత సెలవులు (ఈఎల్స్) ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యాజువల్ లీవులకు కోత పెట్టనున్నారు. అయిపోయాక ఈఎల్స్‌లో కోత పెడుతారు. కార్యాలయ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు కార్యాలయ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం అధికారులు ఉద్యోగుల ఎఫ్ఆర్ఎస్ హాజరు, సెలవుల ఖాతాలను నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాజరు వివరాలను ప్రతి నెల 20వ తేదీలోపు అకౌంట్స్ ఆఫీసర్‌కు నివేదిక సమర్పించాలని సూచించారు.
హాజరు – కోతలిలా..
- ఉద్యోగులను ఉదయం 10.40గంటల వరకే అనుమతిస్తారు. ఆ సమయంలోపే ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో లాగిన్కావాలి.
- ఉదయం 10.41 గంటల నుంచి ఉదయం 11. 30 గంటల వరకు వచ్చే వారి విషయంలో అత్యంత కఠినంగా ఉంటారు. నెలలో మూడు రోజులు ఇలా లేట్ వస్తే ఒక క్యాజువల్ లీవ్ (సీఎల్) కింద పరిగణిస్తారు. సీఎల్స్‌ను కట్‌చేస్తారు.
- ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటల తర్వాతే కార్యాలయాలు వదిలివెళ్లాలి. సాయంత్రం 4 గంటల్లోపు కార్యాలయం వదిలి వెళ్తే ఒక పూట(ఆఫ్‌డే) క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తారు.. సాయంత్రం 4 -5 గంటల మధ్యలో కార్యాలయం వదిలి వెళ్లినా డుమ్మా కిందే పరిగణిస్తారు. ఇలా వరుసగా మూడు రోజులు ముందు వెళితే ఒక క్యాజువల్ లీవ్ (సీఎల్)గా పరిగణిస్తారు.
- బయట ఏదైనా శాఖపరమైన పని ఉంటే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి. లేదంటే డుమ్మా కొట్టినట్టుగానే పరిగణించి సెలవులు, లేదంటే జీతం కట్‌చేస్తారు.
భవిష్యత్తులో టీచర్లకూ..
విద్యాశాఖ డైరెక్టరేట్‌లో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు విషయంలో విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. అయితే ఇవే నిబంధనలను టీచర్లకు సైతం వర్తింపజేస్తారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో లక్ష మందికి పైగా టీచర్లు ఉన్నారు. వీరికి సైతం ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలు చేస్తున్నారు. అయితే సెలవులు, జీతానికి కోత పెట్టడం లేదు. కొందరు టీచర్లు అదే పనిగా విధులకు గైర్హాజరవుతున్నారు.
ఇటీవలే జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. మిగతా జిల్లాల్లోనూ కొందరికి నోటీసులిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇంత వరకు ఆన్‌డ్యూటీ ఇవ్వలేదు. కానీ సంఘాల నాయకుల్లో అత్యధికంగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీనిని సీరియస్‌గా పరిగణిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంకాగానే ఆలస్యంగా వెళ్లిన టీచర్ల సీఎల్స్, ఈఎల్స్‌కు కోత పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

