హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేసింది. అస్సాం 12, హర్యానా 7, మధ్యప్రదేశ్ 19, ఒడిశా 22, రాజస్థాన్ 15, ఉత్తరప్రదేశ్‌కు 35 పాలిటెక్నిక్ కాలేజీలను కేంద్రం మంజూరుచేసింది. వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది.
హైదరాబాద్, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో ఇకపై రోజుకు ముగ్గురు చొప్పున నైట్‌డ్యూటీ విధించాలని నిర్ణయించారు. ప్రిన్సిపాళ్లకు గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రతిరోజూ ఒకరికి చొప్పున నైట్‌డ్యూటీ విధించేవారు. వారు రాత్రి 9గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించేవారు. ఉదయం కూడా స్టడీ అవర్స్ నిర్వహించేవారు. మధ్యాహ్నం 1.30గంటలకు ఇంటికి వెళ్తున్నారు. అయితే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇకపై రోజుకు ముగ్గురు చొప్పున నైట్‌డ్యూటీలు విధించాలని, అదే సెలవు రోజుల్లో అయితే నలుగురు సిబ్బందికి డ్యూటీలను ఉదయం నుంచి రాత్రి వరకు విధించాలని సొసైటీ నిర్ణయించింది.