హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. విధి నిర్వహణలో ఎదురొంటున్న సమస్యలకు పరిషార మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20, 21, 22వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ‘విమెన్ ఇన్ పోలీస్’ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
సదస్సులో అభిప్రాయాల ఆధారంగా జెండర్ పాలసీని రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్తో కలిసి గురువారం పోస్టర్ విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో యూనిఫామ్ సర్వీసెస్ నుంచి 400 మందికి పైగా మహిళా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.