హైదరాబాద్ : హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కు అదనంగా రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసన సభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మెరుగైన రవాణా సౌకర్యం ఈ రింగ్ రోడ్ ద్వారా కలుగుతుందన్నారు. ప్రసుత ఔట్ రింగ్ రోడ్‌కు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానున్నదన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ అభివృద్ధి కొత్త ఊపునిస్తుందన్నారు. ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు.