హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ జారీకి విధి విధానాల రూపకల్పనకు నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులుగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, ది హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్ రవికాంత్‌రెడ్డి, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, వీ6 సీఈవో అంకం రవి, నవ తెలంగాణ సీనియర్ ఫొటోగ్రాఫర్ నరహరితోపాటు సమాచారశాఖ ప్రత్యేక కమిషనర్ ఉన్నారు.
జర్నలిస్టులకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీకి నూతన విధి విధానాలు రూపొందించనున్నది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.