వరంగల్ : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకల నేపథ్యంలో మంగళవారం బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులైన బాల, బాలికలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కొత్త బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేటర్ డాక్టర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులు శోభన్, అనిల్ రావు, రంజిత్, పద్మతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈనెల 17 వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ముందస్తుగా మూడు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బాలసముద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.