Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ఇప్పుడు విద్యాశాఖకు కొత్తబాస్లొచ్చారు. కొత్తగా వచ్చారంటే బదిలీపై వచ్చారని కాదు.. వారు వచ్చింది విద్యాశాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో. ఇంతకు ఎవరంటే వారు… ముగ్గురు మంత్రుల నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ ఒకటి కాగా, విద్యా కమిషన్ మరోటి.
ప్రభుత్వ స్థాయిలో ఏదై నా కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఇదివరకు అధికారులు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపించేవారు. వాటిని విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలనకు పంపించేవారు. ఇవి ఆమోదం పొందడమో.. లేక తిరస్కరణకు గురవడమో జరిగేవి. కానిప్పుడు కొత్తగా విద్యాసంస్కరణలపై ముగ్గురు మం త్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పా టు చేశారు.
ఆ తర్వాత ఇటీవలే విద్యా కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో విద్యాశాఖకు కొత్త బాస్లొచ్చినైట్లెంది. ఇక నుంచి ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా.. ఈ రెం డింటి పరిశీలనకు పంపాల్సి ఉంది. వీటి ఆమోదం తీసుకున్న తర్వాతే అవి కార్యరూపందాల్చుతా యి. ఇలా కొత్త బాస్‌లు, రెండు, మూడు అంచెల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవడంతో పలు కీలక నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.