Kishan Reddy | తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లో భాగంగా ట్యాంక్‌బండ్( Tankbund ) వేదికగా నిర్వహించిన మిలియన్ మార్చ్( Million March ) జరిగి నేటికి పుష్కర కాలం గడిచింది.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఓ ఫోటోను కూడా జత చేశారు. అయితే ఆయన షేర్ చేసిన ఫోటోతో మిలియన్ మార్చ్‌కు ఎలాంటి సంబంధం లేదని నెటిజన్లు కిషన్ రెడ్డిని తప్పుబడుతున్నారు. పంచులు వేస్తూ ఆటాడుకుంటున్నారు.
కిషన్ రెడ్డి ట్వీట్ చేసిన ఫోటో.. ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) ఆర్ట్స్ కాలేజీ( Arts College ) వేదికగా జరిగిన తెలంగాణ విద్యార్థి గర్జన( Telangana Vidyarthi Garjana ) ఫోటో అది. విద్యార్థి గర్జన 2010, జనవరి 3వ తేదీన నిర్వహించారు. మిలియన్ మార్చ్ 2011, మార్చి 10న ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించారు. కిషన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి చేసింది సున్నా కాబట్టి ఈ ఫోటో ఎప్పటిదో కూడా తెలియదని కిషన్ రెడ్డిని తూర్పారాబడుతున్నారు.
కిషన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి చేసింది సున్నా కాబట్టి ఈ ఫోటో ఎప్పటిదో కూడా తెలియదు ..
03 జనవరి 2010: ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ విద్యార్థి గర్జన ఫోటో అది..
మిలియన్ మార్చ్ జరిగింది 2011 మార్చి 10 న..
మిలియన్ మార్చ్ ఫోటోలు 👇 pic.twitter.com/sn7TcFzyIv
— Jagan Reddy (@JaganReddyBRS) March 11, 2023