హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, బెంగళూరులో మౌలిక సదుపాయాలను పోల్చుతూ హైదరాబాదే సూపర్ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనూజ్ గుర్వారా అనే నెటిజన్ ఈ రెండు మెట్రో నగరాలను పోల్చుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ‘బెంగళూరు అచ్చా షహర్ హై. మేరేకు పసంద్ హై. మేరే ప్యారా దోస్తో.. మై ఆతే, జాతా హూ. మగర్ బెంగళూరు వాలేనే ఊ బోలోతే వెదర్ అచ్చా హై, గుడ్ మార్నింగ్ బోలేతో వెదర్ అచ్చా హై. మై మాన్తా హు. వెదర్ అచ్చా హై తుమారా. యునెస్కోనే అవార్డు దేదియా. వరల్డ్ మే బెస్ట్ వెదర్ బోలేతో బెంగళూరు. అబ్ క్యాకర్నా వెదర్ కా?
ఆదా కిలో పార్సల్ లేకే ఘర్ మే జాకే మలాయి లేకే చాట్ కర్లూ. అరె ట్రాఫిక్ మే తీన్ తీన్ గంటే ఎక్కీ జగే అటక్కే బైటే రహేతో క్యా దిక్తా? వెదరీచ్ దిక్తానా? హమ్కో హైదరాబాద్మే ఉత్తాటైం నహీ. సడకా బడాబడా హై. గాడియా జూమ్ జూమ్ కర్కే నికల్ జాతా హై. ఇదర్ సే మెట్రో జారా. ఉదర్ సే ఫ్లై ఓవర్ జారా. ఏకీ జగా జానేకో చార్ చార్ రాస్తే రహేతే. తుమ్నే వన్‌వే జిలేబీమే అటక్కే రహజాతే కబీబీ జగా దిక్రీ కహ జానేకాహై. పౌంచ్ నేమే దో దో సాల్ వహీ గుమ్ లేకే బైట్రీ. లెకిన్ మై జాకే పూచేతో వెదర్ కిత్తా అచ్చాహై.. అరె!’అని పేర్కొన్నాడు.
ఈ ట్వీట్‌ను బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ రీట్వీట్ చేశారు. దీంతో ఇది పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ స్పందిస్తూ హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి 1.20 గంటల్లో చేరుకొంటే, బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ లేదా వైట్ ఫీల్డ్‌కు కారులో వెళ్లాలంటే 2.50 గంటలు పడుతుందని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను వెయ్యి మందికి పైగా లైక్ చేసి రీట్వీట్ చేశారు.