హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధభవన్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఆమె పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు కమిషన్ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఆమెకు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక శుభాకాంక్షలు తెలిపారు.