హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/స్టేషన్ ఘన్పూర్: ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవి 2025 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక కాళోజీ పురసారానికి ఎంపికయ్యారు. మంగళవారం (9వ తేదీన) కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంసృతిక శాఖ ద్వారా ఏటా ప్రతిష్ఠాత్మకంగా సాహితీ పురసారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.
2025వ సంవత్సరానికి కాళోజీ పురసారం ఎంపికకు ప్రభుత్వం అందెశ్రీ అధ్యక్షతన జ్యూరీ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహితీ పురసారానికి ఎంపిక చేసినట్టు ఆదివారం ప్రకటించింది. తెలంగాణ భాషా దినోత్సవం సంబురాల్లో భాగంగా మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న కాళోజీ జయంతి వేడుకల్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. రమాదేవిని సత్కరించడంతోపాటు అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని అందజేయనున్నారు. అవార్డుకు ఎంపికైన రమాదేవికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్నోన్నో అవార్డులు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన నెల్లుట్ల రమాదేవి వృత్తిరీత్యా సీనియర్ బ్యాంక్ మేనేజర్. రమ కలం పేరుతో కార్టూనిస్ట్‌గా, రచయిత్రిగా పేరు పొందారు. మనసు భాష (కవిత్వం)- 2011, రమణీయం(కార్టూన్లు)-2011, మనసు మనసుకూ మధ్య (కథలు)-2011, చినుకులు (నానీలు)-2021, తల్లి వేరు (కథలు)-2021, డీ కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023, అశ్రువర్ణం (కవిత్వం)-2024, రమాయణం-1 (కాలమ్స్)-2024 ప్రచురించారు.
ఇప్పటికే సుశీలా నారాయణరెడ్డి పురసారం, అపురూప అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి (వరంగల్ జిల్లా), తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురసారం, ప్రతి భా పురసారం, జాతీయ సాహిత్య పరిషత్తు, సిద్దిపేట ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురసారం, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు, గుర్రం జాషు వా ఫౌండేషన్ పురసారం, వెంకటసుబ్బు స్మారక అవార్డు, పర్చా రంగారావు స్మారక అవార్డు, తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురసారం, రాగతి పండరి స్మారక పురసారం, ప్రొఫెసర్ వాసిరెడ్డి భాసర్‌రావు స్మారక పురసారం, ఎక్స్‌రే పత్రిక ఉత్తమ కవితా పురసారం, డాక్టర్ రాణీ పులోమజాదేవి స్మారక గౌరవ పురసారం, డాక్టర్ సినారె సాహిత్య పురసారాలతోపాటు కార్టూన్లు, కవిత్వం, కథలకూ పలు అవార్డులను పొందారు.