హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): జీఎంఆర్ ఎయిర్‌పోర్టు లో ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తన తల్లి కి మోకాలి ఆపరేషన్ అయినందున వీల్ ఛైర్ ఏర్పాటుకు ముందస్తు సమాచారం ఇచ్చినా ఎయిర్‌పోర్టు సిబ్బంది పట్టించుకోకపోగా, సెక్యూరిటీ క్లియరెన్స్ అయ్యాక చెప్పండి అని నిర్లక్ష్యం గా సమాధానం ఇచ్చారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో 13 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలపట్ల వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడీపీఏలో 65.7శాతం సేవల రంగం, 18శాతం పరిశ్రమల శాఖ కాంట్రిబ్యూట్ చేస్తు న్నా బడ్జెట్లో ఈ రంగాలకు కేటాయింపులు అరకొరగా ఉన్నాయని మండిపడ్డారు. ఫార్మాసిటీని ముచ్చెర్లలోనే ఏర్పాటు చేయాలని, స్మాల్ స్కే ల్ ఇండస్ట్రీస్‌కు చేయుతనివ్వాలని కో రారు. గత ఏడాది పరిశ్రమలకు రూ. 1400 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తే, ఈసారి రూ. 500 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారని విమర్శించారు.