నీట్ – యూజీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్- యూజీ) 2026 షెడ్యూల్ విడుదలైంది.
- మార్చి 8 వరకు గడువు
- మే 3న ఆఫ్‌లైన్‌లో పరీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్- యూజీ) 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 8 రాత్రి 9గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. జనరల్ క్యాటగిరీకి పరీక్ష ఫీజు రూ.1,700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. వెయ్యి చెల్లించాలి. ఎన్నారైలు రూ.9,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షను మే 3న నిర్వహించనున్నట్టు తెలిపింది. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు పరీక్ష నిర్వహిస్తారు. https://nta.ac.in, https://ne et.nta.nic.in వెబ్సైట్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చినా జాతీయంగా 25 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశముండటంతో ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఏ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 011-4O75 9000, 011-69227700 లేదా neetus2026@nta.ac.in ఈ-మెయిల్‌ను సంప్రదించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

