హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే నీట్ అర్హత పరీక్షను రద్దుచేసి, ఈ వ్యవహరంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాల భవిష్యత్‌కు సంబంధించిన విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, అందుకు భిన్నంగా ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదని మండిపడ్డారు.