హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్-యూజీ) 2025 దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ప్రారంభమైంది. మార్చి 7 రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 9 నుంచి 11 వరకు దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవచ్చు.
పరీక్ష ఫీజును జనరల్ క్యాటగిరీ వారికి రూ.1700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000గా నిర్ణయించారు. ఏప్రిల్ 26న సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ విడుదల చేస్తారు. మే 1 నుంచి అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 14లోపు ఫలితాలు విడుదల చేయనున్నారు.