Minister Indrakaran Reddy | రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపు
Minister Indrakaran Reddy | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రతినిధుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి , తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ(BJP) మోకాలడ్డుతున్న తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతితో పాటు బీజేపీ వైఫల్యాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు.
సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పరిపాలనా ధక్షత కలిగిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, స్వరాష్ట్రంలో వాటిని అధిగమించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర(Maharastra) లో కూడా సీఎం కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మతతత్వ పార్టీ బీజేపీ లో చేరాడని తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

