హైదరాబాద్, ఏప్రిల్25 (నమస్తే తెలంగాణ): ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అందజేసిన నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
నివేదికపై సమగ్రమైన అధ్యయనం చేస్తామని వెల్లడించారు. క్యాబినెట్లో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలకు బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఏ ఒకరినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.