Pulimeti Srihari | నయీం ప్రధాన అనుచరుడు పులిమేటి శ్రీహరి కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సైదాబాద్ కరణ్బాగ్లోని ఆయన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.
భువనగిరిలో నయీం ఎన్కౌంటర్ తర్వాత సిట్, పోలీసుల ఒత్తిడితో 2017లో రంగారెడ్డి కోర్టులో పులిమేటి శ్రీహరి లొంగిపోయాడు. అనంతరం బెయిల్పై వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. కాగా, పలు హత్యలు, భూ దందాలు, సెటిల్మెంట్లు, ఇతరత్రా కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. ముసారంబాగ్ శ్మశన వాటికలో శ్రీహరి అంత్యక్రియలు చేయనున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.