శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:33:14

లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలి

లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు, న్యాయవాది ఎం లింగం నాయీని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలని ఆ వేదిక నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో అడుగుపెట్టని నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్‌చంద్ర, కార్యనిర్వాహక అధ్యక్షుడు పడుగు హరిప్రసాద్‌, నాయకులు అనంతయ్య, రమేశ్‌కుమార్‌, పద్మారావు, రమేశ్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.