BRS UK Naveen Rddy | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): యునైటెడ్ కింగ్డమ్ బీఆర్ఎస్ ఎన్నారై నూతన అధ్యక్షుడిగా నవీన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సంయుక్తంగా ప్రకటించారు. 14ఏండ్లుగా తెలంగాణ ఉద్యమంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రియాశీల పాత్ర, ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నామని మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా హరి నవాపేట్, సతీశ్‌రెడ్డి, సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్లుగా శ్రీకాంత్ జెల్ల, గణేశ్ కుప్పాలతోపాటు సభ్యులను ఎన్నుకున్నట్టు తెలిపారు.