హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సుందిళ్ల బరాజ్ వద్ద సీపేజీ సమస్యను పరిష్కరించామని, గ్రౌంటింగ్ పూర్తి చేశామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పష్టంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన మేరకు సాంకేతిక పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ ఎదుట గురువారం నివేదించారు. సుందిళ్ల బరాజ్‌ను నిర్మించిన నవయుగ సంస్థ డైరెక్టర్ రమేశ్, ప్రాజెక్ట్ ఇన్చార్జులు ఈశ్వరరావు, మాధవ్‌ను కమిషన్ చైర్మ న్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. బరాజ్ నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, సాంకేతిక సమస్యలు, చేపట్టిన నివారణ చర్యలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక ఓఅండ్ఎం కోసం ప్రత్యేకంగా ఒప్పం దం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సుందిళ్ల బరాజ్ పనులు 2021 డిసెంబర్లో పూర్తయ్యాయని, 2023లో క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. 2022లో వచ్చిన భారీ వరదలతో బరాజ్‌కు చెందిన ఓ బ్లాకులోని సీసీ బ్లా కుల కింద సీపేజీ ఏర్పడిందని, అందువల్ల అ న్ని సీసీ బ్లాకులపై ఎఫెక్ట్ పడిందని, గ్రౌంటిం గ్ చేసి ఆ సీపేజీలను నియంత్రించామని వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు సిఫార్సు చేసిన పరీక్షలు, మరమ్మతులు పూర్తి చేశామని, వాటి నివేదికలు కూడా ఇచ్చామని, వాటిపై సంబంధిత అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ బిల్లులను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, బిల్లులను క్లియర్ చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని కమిషన్ ఎదుట వాపోయారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): మేజర్, మీడియంతోపాటు అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టిసారించాలని, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందేలా చూడాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆదేశించారు. గురువారం జలసౌధలో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కమిటీ సమావేశం ఈఎన్సీ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 105 ప్రాజెక్టులకు సంబంధించి మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చించి దాదాపు 70 పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఈఎన్సీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టుల కాల్వలు అధ్వానస్థితిలో ఉన్నాయ ని దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. 10వేల ఆయకట్టుకు పైగా ఉన్న కాల్వల మరమ్మతులకు ప్రా ధాన్యమివ్వాలని, అందుకు ప్రతిపాదనలు సి ద్ధం చేయాలని అధికారులకు సూచించారు.