న్యూఢిల్లీ: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కోసం అమెరికా తయారు చేసిన ఆయుధాలు ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్ల చేతికి వెళ్తున్నాయి. ఇవి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తుపాకులు తదితర ఆయుధాలు పంజాబ్, జమ్ముకశ్మీర్‌లలో పట్టుబడుతున్నాయి. నాటో సంకీర్ణ దళాల వద్ద ఉండే ఈ ఆయుధాలు నల్ల బజారులోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి? అవి భారత్‌కు ఎలా చేరుతున్నాయి? అనే అంశాలు అంతుబట్టడం లేదు. అఫ్గానిస్థాన్ నుంచి 2021లో అమెరికా దళాలు వైదొలగిన తర్వాత పెద్ద ఎత్తున ఆయుధాలను వదిలిపెట్టాయి. ఇవి తాలిబన్ల వశమయ్యాయి. ఇజ్రాయెల్ వ్యతిరేక ఉగ్రవాదుల వద్ద కూడా ఎం4 అసాల్ట్ రైఫిల్స్ వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఇటీవల కూలిపోయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మించి ఉంటే అది కూలేది కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాల్లో తుప్పును నివారించే లోహాలను వాడాలని ఆయన సూచించారు. 35 అడుగుల శివాజీ విగ్రహం కూలడంతో అధికార బీజేపీపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీర ప్రాంతాలకు సమీపంలో నిర్మించే వంతెనల నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ వాడాలంటూ తాను గత మూడేండ్లుగా చెబుతున్నానని గడ్కరీ అన్నారు.