దేశవ్యాప్తంగా ఈడీ అధికారుల బదిలీలు
దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టారు. తాజా బదిలీల్లో హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 56 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు.
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టారు. తాజా బదిలీల్లో హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 56 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. రెగ్యులర్ విధులతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించేలా మరో 14 మంది డిప్యూటీ డైరెక్టర్ (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న సుమీత్శర్మ బదిలీ అయ్యారు. ఈయనను షిమ్లా సబ్ జోనల్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. అలాగే భోపాల్ జోనల్ ఆఫీస్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వాతి నోఖ్వాల్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. సోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఈవోగా ఉన్న జైరామ్ లఖ్రాన్ను హైదరాబాద్ జోనల్ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో, గౌహతి, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లోని జోనల్ కార్యాలయాల్లోనూ పెద్దఎత్తున మార్పులు జరిగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

