హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూన్ 26న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్టు తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) ప్రకటించింది. మార్చిలో దేశవ్యాప్తంగా సమ్మె సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పీ రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పీ సదానందం తెలిపారు.
నేషనల్ కో ఆర్డినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అండ్ ఎంప్లాయిస్(ఎన్సీసీవోఈఈఈ) నిర్ణయం మేరకు తెలంగాణలోనూ సమ్మెకు దిగుతామని ప్రకటించారు.