హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులను పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చిన విజయ్ దేవరకొండపై నామమాత్రంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి చేతులు దులుపుకున్నారని గిరిజన సంఘాల నాయకులు బుధవారం ఢిల్లీలో ఎస్టీ కమిషన్కు తెలిపారు. దీంతో విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయకపోవడంపై కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.