హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీం(సీపీఎస్) రద్దుపై జాతీయస్థాయిలో ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సమాయాత్తమవుతున్నాయి. ఆదాయ పు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అఖిల భా రత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమా ఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) హైదరాబాద్ వేదికగా జాతీయస్థాయిలో కార్యాచరణను ప్రకటించనుంది. 13, 14న ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ సమావేశాలు హై దరాబాద్‌లో జరగనున్నాయి. జాతీయ అధ్యక్షుడు సుభాష్ లంబ, ప్రధాన కా ర్యదర్శి శ్రీకుమార్ సహా పలు రాష్ట్రాల కు చెందిన ప్రతినిధులు రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొంటారని ఏ ఐఎస్జీఈఎఫ్ ఉపాధ్యక్షుడు, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ తె లిపారు. సీపీఎస్, ఆదాయపు పన్ను ప రిమితి పెంపు, పెండింగ్ డీఏల విడుద ల, ప్రభుత్వశాఖల్లోని ఖాళీల భర్తీ, ప్రైవేటీకరణ రద్దు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీరణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
సురక్షిత సింగరేణిని ఆవిష్కరిద్దాం
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణా లు ఎంతో విలువైనవని సింగరేణి సీఎండీ ఎ న్ బలరాం అన్నారు. రక్షణ నియమాలు పా టిస్తూ సురక్షిత సింగరేణిని ఆవిష్కరిద్దామని ఆయన ఆకాంక్షించారు. శనివారం 11ఏరియాల్లోని 40గనుల రక్షణ కమిటీలు, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్ కమిటీ సభ్యులు, రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికులకు రక్షణకు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టంచేశారు. దవాఖానల్లో ప్రత్యేక వైద్యనిపుణులను నియమిస్తున్నామని, రామగుం డం ఏరియా హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీ దవాఖానగా రూపుదిద్దుతామని హామీఇచ్చా రు. డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, డీ సత్యనారాయణరావు, జీ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.