హైదరాబాద్, ఆగస్ట్ 19 (నమస్తే తెలంగాణ): జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్ఎంసీ 4 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
యాదాద్రి భువనగిరి, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం మెడికల్ కాలేజీలకు అనుమతులు రాలేదు. దీంతో ఎన్ఎంసీ సూచించిన మేరకు లోటుపాట్లను సవరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు మరోసారి ఎన్ఎంసీకి అప్పీల్ చేయడంతో ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, 4 కాలేజీల ప్రిన్సిపాళ్లు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయా మెడికల్ కాలేజీల భవితవ్యం ఎన్ఎంసీ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది.