హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డీహెచ్ఎం-206 హైబ్రిడ్ మొకజొన్న రకానికి జాతీయస్థాయిలో డిమాండ్ ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఇది హెక్టార్‌కు 10 టన్నులదిగుబడి ఇస్తుందని, చారోల్రాట్ వంటి తెగులును తట్టుకుంటుందని చెప్పారు. హైబ్రిడ్ విత్తనాల మారెటింగ్కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కర్నూలుకు చెందిన చక్రా సీడ్స్, సాయికృష్ణ సీడ్స్ కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్, కంపెనీ ప్రతినిధులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. రాజేంద్రనగర్‌లోని మొకజొన్న పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన డీహెచ్ఎం-117,డీహెచ్ఎం-121 వంటి హైబ్రిడ్ వండాలకు మారెటింగ్ సదుపాయం కల్పించేందుకు గతంలో 43 సంస్థలతో అవగాహన ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.
నేడు వ్యవసాయ విశ్వవిద్యాలయం 10వ వ్యవస్థాపక దినోత్సవం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీజేటీఎస్ఏయూని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. పీజేటీఎస్ఏయూ10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రీ య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సోమవారం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో విలేకరులతో మా ట్లాడారు.
2014లో ఏర్పాటైన పీజేటీఎస్ఏయూ జాతీయస్థాయిలో ఉన్నత శిఖరాల్ని అందుకుందని గర్తు చేశారు. పదేళ్లలో 5 కొత్త వ్యవసాయ కళాశాలలు, ఫుడ్ సైన్స్ టెక్నాల జీ, 4 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రారంభించి, సీట్ల సంఖ్యను 1360కి పెంచామన్నారు. అమెరికాలో ని అబర్ ్న విశ్వవిద్యాలయంలో అగ్రికల్చ ర్లో పీజీ కోర్సు అభ్యసించే విద్యార్థులకు ఓవర్సీస్ ఫెలోషిప్ అందిస్తున్నట్టు పేరొన్నారు. కళాశాలలోని ఎలక్ట్రానిక్ విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ కలిసి రూపొందించిన రైతు నేస్తం ప్రత్యక్ష చర్చా కార్యక్రమం ద్వారా 556 రైతు వేదికల్ని అనుసంధానం చేసి లక్షా 30 వేల మంది రైతులకు సలహాలు అందించామన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులు, బోధన, బోధనేతర సిబ్బందికి అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.