హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరిస్థితుల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. 150 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల తదితర అంశాలపై అక్టోబర్‌లో న్యాయవాది రామారావు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి సరుకుల నాణ్యతను పరిశీలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించా రు. బుధవారం సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీసీలో మాట్లాడుతూ.. 14న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాస్టళ్లను సందర్శిస్తారని తెలిపారు.