హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం ఓ ఉత్సవంగా నిర్వహిస్తుండడం వృత్తిపై ఆధారపడ్డ యువత భవిష్యత్తుపై ఆశ, దీమాను పెంపొందింపజేస్తున్నదని తెలంగాణ పద్మశాలి ప్రొఫెషనల్స్ – అషిఫియల్స్ అసోసియేషన్ (టీపోపా) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. హైదరాబాద్లోని పద్మశాలి భవన్లో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించినప్పుడే మగ్గం బతుకుల్లో కాంతులు నిండుతాయని, అందరు తప్పనిసరిగా నేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు.