ఉప్పల్, జూన్ 30: నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ డీ శ్రీనివాస శర్మ నేషనల్ జియోసైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో బంగారు నిక్షేపాలపై ఆయన పరిశోధనలు చేశారు. శ్రీనివాసశర్మ పరిశోధనల వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
ఆయన ఉస్మానియా వర్సిటీ నుంచి జియోకెమిస్ట్రీ అండ్ జెనెసిస్ ఆఫ్ గోల్డ్ మినరలైజేషన్లో డాక్టరేట్ పట్టా పొందారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైస్సెన్స్లో ఫెలోగా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోగా ఉన్నారు. రామన్ రిసెర్చ్ ఫెలోషిఫ్లో భాగంగా కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. శ్రీనివాసశర్మకు పలువురు సైంటిస్టులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.