హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యరంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యాసంస్థలవారీగా రోడ్‌మ్యాప్ రూపొందించడంపై కసరత్తు చేస్తున్నది. భవిష్యత్తులో విద్యాసంస్థలు అనుసరించాల్సిన ప్రణాళికలు రూపొందించడానికి ఈ నెల 6న ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్‌పై జాతీయ సదస్సు నిర్వహించనున్నది.
ఆన్లైన్లో నిర్వహిం చే ఈ సదస్సులో అందరి అభిప్రాయాలను క్రోడీకరించనున్నది. సదస్సుకు 2వేల మంది నిపుణులు హాజరు కా నున్నారని ఉన్నత విద్యామండలి చైర్మ న్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి తెలిపారు.